![]() |
![]() |
.webp)
బిగ్‌బాస్ కంటెస్టెంట్, బుల్లితెర స్టార్ నటుడు మానస్ రీసెంట్ గా ఒక ఇంటి వాడయ్యాడన్న విషయం అందరికీ తెలిసిందే..ఇక ఇప్పుడు ఒక కార్ వాడు కూడా అయ్యాడు. బ్యాచిలర్ జీవితానికి ఫుల్ స్టాఫ్ పెట్టి పెళ్లి చేసుకుని తన లైఫ్ లోకి ఒక అమ్మాయిని ఆహ్వానించిన కొద్దీ రోజులకే మంచి ఎక్స్పెన్సివ్ కార్ ని కొనేసాడు. 94 లక్షల విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఈ 220 డి అనే కార్ ని కొనేసి ఫామిలీతో సహా ఫోజులిచ్చారు. మానస్ అసలు పేరు సాయి రోహిత్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు మానస్. బుల్లితెర మీద ప్రసారమైన పలు సీరియల్స్ లో మానస్ నటించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఐతే ‘కోయిలమ్మ’ సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న మానస్, వరుస సీరియల్స్ తో బుల్లితెర స్టార్‌గా మారారు. 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్ సీజన్ 5’లో కంటిస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడి ఆటతీరుకు బుల్లి తెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒత్తిడిలోనూ ఏమాత్రం కంట్రోల్ తప్పకుండా చక్కగా గేమ్ ఆడి అలరించాడు. ఆ తర్వాత ‘బ్రహ్మముడి’ సీరియల్ లో నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించాడు.
ఈ సీరియల్ లో రాజ్ క్యారెక్టర్ లో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక వరుస సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు సీరియల్స్ చేస్తూనే, మరోవైపు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ నటిస్తున్నాడు. టీవీ షోస్ లో కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్నాడు. ఓంకార్ తెరకెక్కించిన ‘మ్యాన్షన్ 24’తో ఇటీవల మానస్ అలరించారు. "మా ఇంటికి వచ్చిన కొత్త సభ్యురాలిని మీకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ తో తన కార్ ఎదురుగా నిలబడిన తన ఫామిలీ పిక్ ని పోస్ట్ చేసాడు. ఇక మానస్ ఫాన్స్ అంతా ఆయనకు విషెస్ చెప్తున్నారు. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో మానస్ డాన్స్ కి హీరో మెటీరియల్ అంటూ ఇంద్రజ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మానస్ ఫాన్స్ కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తామా అని ఆశ పడుతున్న టైంలో మానస్ కూడా త్వరలోనే ఆ అవకాశం వస్తుందంటూ ఒక హింట్ ఇచ్చాడు.
![]() |
![]() |